అమ్మఒడి పథకం రెండో విడత సాయాన్ని జనవరి 9, 2021 న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అమ్మఒడి పథకం ద్వారా లబ్ది పొందేందుకు కొత్త రిజిస్ట్రేషన్లకు కూడా అవకాశం ఇచ్చారు. ఈనేపధ్యంలో అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు సోమవారం నాడు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి అమ్మఒడి లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను https://jaganannaammavodi.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ ఈ ప్రాథమిక జాబితాను గ్రామా, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు పెడతామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించి డిసెంబర్ 30వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. అర్హత ఉండి ఈ జాబితాలో పేరు లేకుంటే ఆ విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 1 వ తరగతి నుంచి 10 తరగతి వరకు 72,74,674 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ కు సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు కలిపి మొత్తం 83,72,254 మంది అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ