యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్

Cyber Crime Police Busted Instant Personal Loan Apps and Arrested 6 Members,Instant Personal Loan Apps Case Busted By Cyber Crime Police,Personal Loan Apps,Cyber Crime Police,Cyber Police,Sajjanar IPS,Sajjanar Press Meet,Sajjanar Speech,IPS Sajjanar,IPS Sajjanar Speech,Personal Loan App,Personal Loan,Personal Loan Telugu,IPS Sajjanar Press Meet,Mango News,Mango News Telugu,Online Loan Apps Case Latest Update,6 Representatives In Cyber Crime Police Custody,Hyderabad Cyber Crime Police,Cyber Crime,Online Loan Apps,Online Loan Apps Latest Update,Online Loan App Cyber Crime,Cyber Crime On Online Loan App Scandal,Cyber Crime On Loan Apps Issue,Cyber Crime On Online Loan Apps,Loan Scandals Latest News,About Cyber Crime On Online Loans,About Online Loan Apps

ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను మంగళవారం నాడు సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు. నగరంలోని రాయదుర్గం కేంద్రంగా పనిచేస్తున్న ఆనియన్‌ క్రెడిట్‌ లిమిటెడ్‌, క్రెడ్‌ ఫాక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థలకు చెందిన శరత్‌చంద్ర సహా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఈ రెండు సంస్థల్లో 110 మంది సిబ్బంది చేస్తున్నారని, కాల్ సెంటర్ కూడా నడుపుతున్నారని చెప్పారు. ఇప్పటికి 1.5లక్షల మంది వివిధ ఆన్‌లైన్‌ యాప్స్‌ నుంచి లోన్‌ తీసుకున్నారని, వారిలో 70వేల మంది బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోందని సీపీ పేర్కొన్నారు. క్యాష్ మామా, లోన్ జోన్ యాప్స్ మరియు ఇతర కనెక్టెడ్ కంపెనీలతో ద్వారావ్ ఆన్‌లైన్ లో రుణాలు ఇచ్చి సుమారు 35 శాతం వడ్డీ వసూలు చేస్తూ ఫేక్‌ లీగల్‌ నోటీసులతో వినియోగదారులను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చే అంశాన్ని ఆర్‌బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

మరోవైపు ఈ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.1.51 కోట్లను నిలుపుదల చేసినట్లు సీపీ తెలిపారు. అలాగే నిందితుల వద్ద నుంచి 22 మొబైల్‌ ఫోన్లు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌ లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రుణ యాప్స్ కు సంబంధించి ఇప్పటికి ఐదు కేసులు నమోదు చేశామని, సుమారు 50 వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ యాప్‌ల బారినపడి వేధింపులకు గురవుతున్న వారు ఉంటే స్థానిక పోలీసుల వద్ద ఫిర్యాదు చేయాలని సూచించారు. అనుమతిలేని యాప్స్‌ను నుంచి ఆన్‌లైన్ లో రుణాలు తీసుకోని మోసపోవద్దని ప్రజలను కోరారు. మోసం చేసే యాప్‌ నిర్వాహకులపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తామన్నారు. నగరంలో ఇటువంటి వేధింపులకు పాల్పడే యాప్స్ పై ప్రత్యేక బృందాలతో విచారణ చేయనున్నట్టు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twenty =