ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరులు

CM Jagan TDP Chief Chandrababu Nandamuri Balakrishna and Others Casting Their Votes AP MLC Elections,CM Jagan and TDP Chief Chandrababu Casting Their Votes,AP MLC Elections Balakrishna Casting his Vote,Casting Votes at AP MLC Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Legislative Assembly,AP MLC Elections 2023,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,AP Latest Political News,Andhra pradesh Politics,AP MLC Elections Latest News,AP MLC Elections Live News

ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది సభ్యులు ఉండగా.. అందరూ ఓటు వేశారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన డోలా బాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాస రావు, ఆదిరెడ్డి భవాని తదితరులు అంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది.

అయితే ఈసరికే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ ముగిసినట్లయింది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. ఇక ఏపీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 ఉండగా.. అధికారిక లెక్కల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 151, టీడీపీకి 23, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. ఇక అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరుగనుందన్న అనుమానాల నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. ఇక ఏపీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 ఉండగా.. అధికారిక లెక్కల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 151, టీడీపీకి 23, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =