జనవరి 28, గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, బీజేపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని వినతి అందజేయనున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల బృందం గురువారం ఉదయం 11గం.30 ని.లకు కలవనున్నారు. రాష్ట్రంలో మొదలైన స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యకులు సోము వీర్రాజు నేతృత్వంలో ఇరు పార్టీల నేతలు రాజ్ భవన్ కు వెళ్తారు. రాష్ట్రంలో ప్రారంభమయిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. ఆన్ లైన్లో నామినేషన్లు స్వీకరించేలా ఎస్.ఈ.సి.కి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































