ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన

Andhra Pradesh, AP Govt, AP Govt Announced Incentives, AP Govt Increased Incentives for Unanimous Grama Panchayats, Cash incentives for sarpanches, Cash incentives for sarpanches elected unanimously, Incentive scheme for unanimously elected gram panchayats, Incentives for Unanimous Grama Panchayats, Mango News, Panchayat Elections in Andhra, Panchayats Department, Panchayats Department in AP, Unanimous Grama Panchayats

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర పంచాయతీలకు ఇంతకుముందు ఇస్తున్న ప్రోత్సాహకాలను పెంచుతూ, ఏకగ్రీవాలపై అవగాహనా పెంచుతూ జీవో 34 తో ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, అలాగే పార్టీల ఆధారంగా ఈ ఎన్నికలు జరపడం లేదని గుర్తు చేశారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం పెంచిన ప్రోత్సాహకాలు:

  • 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు – రూ.5 లక్షలు,
  • 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు – రూ.10 లక్షలు
  • 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు – రూ.15 లక్షలు
  • 10 వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు – రూ.20 లక్షలు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =