రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలి, పార్టీ ఆఫీసులో వరుస సమావేశాల్లో పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Directed AP Telangana Party Cadre to Ready for Upcoming Elections, Janasena Chief Directed AP Telangana Party Cadre to Ready for Upcoming Elections, Pawan Kalyan Directed AP Telangana Party Cadre to Ready for Upcoming Elections, Janasena Chief Pawan Kalyan Directed Telangana Party Cadre to Ready for Upcoming Elections, Janasena Chief Pawan Kalyan Directed AP Party Cadre to Ready for Upcoming Elections, AP Party Cadre to Ready for Upcoming Elections, Telangana Party Cadre to Ready for Upcoming Elections, Upcoming Elections, AP Telangana Party Cadre to Ready for Upcoming Elections, AP Party Cadre, Telangana Party Cadre, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan, Janasena Chief, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సమీక్ష సమావేశాల్లో భాగంగా తెలంగాణలోని పార్టీ నాయకులు, వివిధ విభాగాల్లో ఉన్న యువ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. 32 మందితో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా పక్షం వహిస్తూ పార్టీ పక్షాన వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను నాయకులు, శ్రేణులూ పరస్పర అవగాహనతో, సమన్వయంతో చేపట్టాలన్నారు. తదుపరి తెలంగాణలో చేపట్టబోయే డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణపై ఈ సందర్భంగా చర్చించారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, జన సామాన్యంతో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. వారి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. విశాఖపట్నం, రాజోలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను పలకరించారు. శుక్రవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులతో భేటీ అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ముందుకు వెళ్లడంపై పవన్ కళ్యాణ్ వారికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY