కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో గల అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“మృతుల కుటుంబాలకు ఎల్డీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతో పాటు తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్రంలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నా ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడం లేదు. పరిశ్రమల్లో రక్షణ చర్యల గురించి సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ఫలితంగా రెక్కల కష్టం మీద బతికి కార్మికులు మృత్యువాతపడుతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































