రాజ్యసభలో అదానీ అంశంపై విపక్షాల రగడ.. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు, ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్

PM Modi Gives Strong Counter To Opposition Parties Over Adani Issue in Rajya Sabha,PM Modi Gives Strong Counter,Adani Issue in Rajya Sabha,Modi Strong Counter Adani Issue,Mango News,Mango News Telugu,Adani Group Companies,Adani Gas Share Price,Adani Career,Adani Cement,Adani Electricity,Adani Electricity Bill,Adani Electricity Bill Payment,Adani Enterprises,Adani Enterprises Share Price,Adani Gas,Adani Green Share Price,Adani One,Adani Port Share Price,Adani Power,Adani Power Share Price,Adani Wilmar Share Price,Gautam Adani,Gautam Adani Net Worth

ఈసారి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండీ ఉభయసభలలో హీటు పుట్టిస్తున్న హిండెన్‌బర్గ్-అదానీ వివాదం గురువారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి పార్లమెంట్‌లో ధన్యవాద తీర్మానానికి సమాధానమిచ్చారు. అయితే ప్రధాని ప్రసంగాన్ని సైతం అడ్డుకుంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ తన ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అదానీపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ఆ పార్టీ ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ విధానాలు ఓటు బ్యాంకు రాజకీయాలపై ఆధారపడి ఉన్నాయని ప్రధాని ప్రత్యారోపణ చేశారు. ఈ సందర్భంగా విపక్షాల ‘మోదీ-అదానీ’ నినాదానికి ప్రతిగా బీజేపీ ఎంపీలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..

 • సభలో కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరం.
 • ఉన్నతమైన సభలో ప్రజాసమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేకపోవడం బాధాకరం.
 • వారికి ఒకటే చెప్తున్నా.. మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుంది.
 • దేశం మా వెంటే ఉంది, ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు.
 • కాంగ్రెస్‌ పార్టీ 4 దశాబ్దాలుగా ‘గరీబీ హఠావో’ అని నినదిస్తుంది, కానీ దీనికోసం వారివద్ద ఎలాంటి ప్రణాళిక లేదు.
 • దేశ ప్రజలు కాంగ్రెస్‌ను పదే పదే తిరస్కరిస్తున్నారు, కానీ వారికి అది అర్ధమవడం లేదు.
 • అయితే దేశ ప్రజల జీవితాలను బాగుచేయడానికి మరియు వారి ఆకాంక్షలను నెరేవేర్చడానికి మేము కష్టపడి పనిచేస్తున్నాము.
 • ఇక దేశంలో దశాబ్దాలుగా గిరిజన సంఘాల అభివృద్ధి విస్మరించబడింది.
 • మేము అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం.
 • 18 వేలకు పైగా గిరిజన ఖాతాల్లో విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాము.
 • ప్రపంచ వేదికలపై నిన్న మొన్నటి వరకు మన శాస్త్రవేత్తలను అవమానించే ప్రయత్నాలు జరిగాయి.
 • అయితే మన శాస్త్రవేత్తలు 150కి పైగా దేశాలకు ప్రయోజనం చేకూర్చే వ్యాక్సిన్‌లను తయారు చేశారని గుర్తుంచుకోవాలి.
 • గత తొమ్మిదేళ్లలో పేద ప్రజల కోసం 48 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిపించాం.
 • ఈ ఖాతాల ద్వారా కేంద్ర సంక్షేమ పథకాల నిధులను నేరుగా వారికి అందించాం.
 • ‘ఆజాదీ కా అమృత్ కాల్’ సమయంలో ప్రభుత్వ పథకాలతో కోట్లమంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా చేశాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =