జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారైంది. పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 విజయదశమి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు ప్రకటించారు. అక్టోబర్ 5న తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కానుందని తెలిపారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఏపీలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని, జనసైనికులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకుని, అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం, ప్రజలను చైతన్య పరచడం కోసం పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపడుతున్నారని చెప్పారు. కాగా పవన్ కళ్యాణ్ 6నెలల్లో రాష్ట్రమంతా పర్యటించడంతో పాటుగా, ప్రతి ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY








































