జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కానక దుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళవారం తెలంగాణ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించుకుని తన ‘వారాహి’ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ధర్మపురి చేరుకొని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి బయలుదేరి నేరుగా విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో నేడు ఇంద్రకీలాద్రికి చేరుకొని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు పూజారులు జనసేనాని ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయన వెంట వచ్చారు. ఇక జనసేనాని రాకతో ఇంద్రకీలాద్రికి అభిమానులు పెద్దఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వారాహి వాహనానికి పూజలు పూర్తవడంతో త్వరలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE




































