తెలంగాణలో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేస్తాం, పొత్తుకు ఎవరైనా వస్తే సంతోషం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan says Janasena Party will Contest from 7 to 14 Seats in Telangana Assembly Elections,Pawan Kalyan,Janasena Party will Contest, to 14 Seats in Telangana Assembly Elections,Telangana Assembly Elections,Mango News,Mango News Telugu,Jana Sena Chief Pawan Kalyan,Campaign Vehicle Varahi,Varahi Vehicle,Varahi Ready For Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News And Live Updates,Varahi Vehicle at Kondagattu Temple,Special Puja for Varahi Vehicle,Pawan Kalyan to Perform Special Puja

తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలని, అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశాన్ని బట్టి 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, పరిమిత సంఖ్యలో లోక్ సభ స్థానాల్లో బరిలోకి పవన్ కళ్యాణ్ దిగనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఎన్నికల ప్రకటన వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని తెలిపారు. ఆ క్రమంలో ఎవరైనా పొత్తుకి వస్తే సంతోషమని, అయితే అది జనసేన భావజాలనికి, తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైంది అనుకుంటేనే ఆలోచిద్దామన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్ఎంసీ ఎన్నికల్లా వదిలేయం అని అన్నారు. మంగళవారం సాయంత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన ప్రచార రధం వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ రిసార్ట్ లో జనసేన పార్టీ తెలంగాణ ప్రాంత కార్యనిర్వాహకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కొండగట్టు ప్రాంతం నాకు పునర్జన్మనిచ్చిన నేల. గతంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఒకాయన వచ్చి మీకు ప్రాణ గండం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి అభివాదం చేయడానికి వ్యాన్ ఎక్కితే అక్కడ హైటెన్షన్ వైర్లు తగిలి జుట్టు కాలిపోయింది. నాకింద ఉన్న వారికి బలంగా షాక్ తగిలింది. నాకేమీ కాలేదు కానీ అరగంట వరకు ఏమీ తెలియలేదు. ఆ రోజు నుంచి తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిననేల అని నమ్ముతాను. అలాగే తెలంగాణలోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను” అని తెలిపారు.

“2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తిరిగాను. ఇక్కడి ప్రజల కష్టనష్టాలు బాగా తెలుసు. ఈ ప్రాంత నాయకులు కోరిక మేరకు పరిమితమైన స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాంత సమస్యలపై ఇంకా లోతుగా అవగాహన తెచ్చుకోవాలి. పోలీస్ నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దేహ దారుడ్య కొలతలను మార్చినట్లు కొంతమంది యువత నా దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు మళ్లీ కొత్త కొలతలకు తగ్గట్టు సన్నద్ధం కావడం. కష్టమవుతుందని యువత ఆవేదనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిని అనుసరించి నియామకాలు చేపట్టాలని కోరుతున్నాను. బీజేపీ జాతీయ నాయకుల రిక్వస్ట్ చేయడంతో ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నాం. ఇప్పుడు కూడా నా మద్దతు బీజేపీకి ఉన్నా ఈసారి మాత్రం జనసేన పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అమర వీరుల సాక్షిగా తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం:

“భవిష్యత్తులో ఎన్నికలు ఏ రోజు ప్రకటించినా ముందుకు వెళ్తాం. కావాలంటే ఒకటికి రెండు సార్లు మీ నియోజకవర్గాల్లో తిరుగుతా. కొద్ది మందైనా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నదే నా ఆకాంక్ష. నేను కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నా. ఆ దిశగా నావంతు కృషి చేస్తా. తెలంగాణ అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అమరవీరుల సాక్షిగా చెబుతున్నాను” పవన్ కళ్యాణ్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =