షూటింగ్ చేసే పరిస్థితులు లేవు, అప్పటి వరకు వేచి ఉండాల్సిందే – పవన్ కళ్యాణ్

Cinema Shootings, Cinema Shootings Amid Corona Situation, Janasena President, Janasena President Pawan Kalyan, pawan kalyan, Pawan Kalyan Responds Over Cinema Shootings, Tollywood Cinema Shootings

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులు, కాపు రిజర్వేషన్స్ సహా పలు అంశాలపై తన అభిప్రాయాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా వలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి కూడా స్పందించారు. కరోనా వలన చిత్రపరిశ్రమలో అన్నీ ఆగిపోయాయి. తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్స్ చేయాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. యూనిట్ లో ఎవరికైనా కరోనా సోకితే ఇబ్బందే. కరోనా ముఖ్య నటులకు వచ్చినా, ఎవరికి వచ్చినా ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu