విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Education Summit, Governor, Governor Tamilisai Soundararajan, Innovation in Education Summit, Tamilisai Soundararajan, Tamilisai Soundararajan Addressed at Innovation in Education Summit, telangana governor, Telangana Governor In Education Summit

విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ ద్వారా వాటిని అధిగమించానన్నారు. జూలై 25, శనివారం నాడు “ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్” కు సంబంధించిన అడ్వయిజరీ ఆన్ లైన్ సమావేశంలో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ థియరీ క్లాసులు ఆన్ లైన్ లో సజావుగా సాగుతున్నప్పటికీ, ప్రాక్టికల్ క్లాసుల విషయంలో సమస్యలున్నాయన్నారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలు, ఆలోచనలతో ప్రాక్టికల్ క్లాసులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించాలన్నారు.

నైపుణ్యాల శిక్షణ, ఉన్నత నైపుణ్యాల కోసం నిరంతరం కృషి ఉన్నప్పడే విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణిస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్కిల్ ఇండియా మిషన్’ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులతో స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్ అనే పద్ధతి ద్వారా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఈ పథకాలు వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. జాబ్ – ఓరియెంటెడ్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధిలో తక్కువ వ్యవధి కోర్సులు ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకతను చదువులో మొదటి నుండి గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ ఆర్గలైజేషన్ ఆఫ్ తమిళ్ ఆరిజిన్ (గోటో) అనే సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. తమిళనాడులోని వివిద విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eighteen =