ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 12 కార్పొరేషన్లలో మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (మార్చి 10, బుధవారం) ఉదయం 7-8 గంటల మధ్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విజయవాడలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూల్, పటమట లంకలోని పోలింగ్ బూత్ లో పవన్ కళ్యాణ్ ఓటు వేయనున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ









































