కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో టీడీపీ సాధన దీక్ష, దీక్షలో కూర్చున్న చంద్రబాబు

Chandrababu, Chandrababu Naidu, Chandrababu Sadhana Deeksha, Financial Support to Covid Victims, Mango News, Sadhana Deeksha, Sadhana Deeksha Chandrababu, Sadhana Deeksha with a Demand of Financial Support to Covid Victims, TDP, TDP Conducting Sadhana Deeksha with a Demand of Financial Support to Covid Victims, TDP Deeksha today seeking Rs 10K for poor, TDP Leaders Demands Financial Help To Covid Affected, TDP Sadhana Deeksha, TDP Sadhana Deeksha in AP, TDP seeks ex gratia for COVID victims

కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ మంగళవారం నాడు ‘సాధన దీక్ష’ పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్షకు కూర్చున్నారు. చంద్రబాబుతో పాటుగా పలువురు సీనియర్ నేతలు కూడా దీక్ష చేపడుతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నేతలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్షను కొనసాగించనున్నారు.

కరోనా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసిందని, సుమారు కోటి మంది ఉపాధి కోల్పోయారని టీడీపీ పార్టీ పేర్కొంది. ప్రతి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు, ఆదాయపు పన్ను పరిమితికి లోబడి ఉన్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలి. కరోనా తీవ్రత కొనసాగినంతకాలం నెలకు రూ.7,500 అందించాలని డిమాండ్ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, ఆక్సిజన్‌ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుద్ధ్య , పోలీస్, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా రూ.50 లక్షలు అందించాలి. అలాగే రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =