సంచలన నిర్ణయం తీసుకున్న కేశినేని నాని

vijawada, kesineni nani, yvp, jagan, ap politics
vijawada, kesineni nani, yvp, jagan, ap politics

బెజవాడ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. గత కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వార్‌తో హాట్ హాట్‌గా బెజవాడ రాజకీయాలు కొనసాగాయి. చివరికి ఎన్నికల యుద్ధంలో కేశినేని చిన్ని విజయం సాధించారు. వరుసగా రెండేళ్లు విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఈసారి ఓటమిని చవిచూశారు. ఈక్రమంలో అందరికీ షాక్ ఇస్తూ.. కేశినేని నాని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో బెజవాడ రాజకీయాలు మరోసారి ఘరంఘరంగా మారాయి.

2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ రెండోసారి ఎంపీగా గెలుపొందాక టీడీపీ హైకమాండ్‌తో నాని వైరం పెట్టుకున్నారు. ఢిల్లీలో పలుమార్లు చంద్రబాబు నాయుడు, లోకేష్‌పైనే బహిరంగంగా సంచలన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ టికెట్‌పై విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అటు టీడీపీ తరుపున నాని సోదరుడు కేశినేని చిన్ని పోటీ చేశారు. ఇద్దరూ బెజవాడ రాజకీయాలను కాక రేపారు. గెలుపు నాదే అంటే.. నాదేనంటూ కాక రేపారు. చివరికి వచ్చే సరికి కేశినేని చిన్ని చేతిలో.. నాని ఓటమిపాలయ్యారు.

ఈక్రమంలో నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. రెండు పర్యాయాలు విజయవాడ ప్రజలకు సార్లమెంట్ సభ్యునిగా సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాను. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది. వారి తిరుగులేని మద్ధతుకు కృతజ్ఞతలు. నేను రాజకీయాలకు దూరం అవుతున్నప్పటికీ విజయవాడ పట్ల నాకు ఉన్న నిబద్ధత అలాగే ఉంటుంది.. వాజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్ధతు ఇస్తూనే ఉంటాను. నాకు సమహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నాని పెట్టిన పోస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE