మాజీ మంత్రి కొడాలి నానికి రెండు రోజుల కిందట బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. మార్చి 27న నాని అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షల తర్వాత గుండెపోటుతో పాటు మరోవైపు కిడ్నీ సమస్యలు కూడా బయటపడడంతో వైద్యుల సలహాతో ముంబైలోని ఏసియన్ ఆసుపత్రికి తరలించారు
ప్రముఖ కార్డియాలజిస్ట్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని ఈనెల 2న కొడాలి నానికి ఆపరేషన్ జరిగింది . 8 గంటల పాటు జరిిన ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వైపీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా కొడాలి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇప్పుడే కాదని ..మరో నెల రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అక్కడి డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు. నెల రోజులపాటు డాక్టర్ల అబ్జర్వేషన్ కొనసాగుతుందని..శరీర అవయవాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా వైద్యం అందించనున్నారు.
మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది వైసీపీ కీలక నేతలు నేరుగా ముంబై వెళ్లి నానిని పరామర్శిస్తున్నారు. కాగా ఇప్పటికే పలు కేసుల్లో కొడాలి నాని నిందితుడుగా ఉన్నారు. రేపో మాపో అరెస్ట్ అనేలోగా నాని గుండెనొప్పితో ముంబైకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు నెల రోజుల పాటు ముంబైలో ఉండనున్న నాని..తర్వాత అయినా ఏపీకి వస్తారా లేక మెరుగైన వైద్యం పేరుతో అటునుంచి మరెక్కడికైనా వెళతారా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.