ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, Chirla Jiggireddy, Coronavirus, Kothapeta MLA, Kothapeta MLA Chirla Jiggireddy, Kothapeta MLA Chirla Jiggireddy Tests Positive, MLA Chirla Jiggireddy Tests Positive

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే ఉండి, వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. తనగురించి ఆందోళన చెందవద్దని, కరోనా నెగటివ్ గా వచ్చేంతవరకు ఎవరూ సంప్రదించవద్దని కోరారు. అలాగే గత వారం రోజుల్లో తనతో సమావేశమైన నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్‌ లోనే ఉండి, అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. మరోవైపు ఏపీలో ఆగస్టు 3౦ నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కి చేరుకుంది. వీరిలో 3,21,754 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 99129 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu