ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఎన్నికల సమరం ముగిసిపోయినట్లయింది. ఇక అందరి చూపు జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతుండగా మే 13 న జరిగిన ఎన్నికలతో నాలుగు దశలు పూర్తయినట్లు అయింది. దీంతో మిగిలిన మూడు దశలు కూడా పూర్తి అయ్యాక.. జూన్ 4 దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణలో లెక్కింపు కేంద్రాలలో ఎన్నికల అధికారులు.. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ స్థానాల్లో.. టేబుల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈవీఎం మెషీన్లతో పాటు 500 పోస్టల్ బ్యాలట్ ఓట్లకు ఒక టేబుల్‌ను ఎక్సట్రాగా ఏర్పాటు చేయనున్నారు.
వివిధ ప్రాంతాల్లో అప్పటి వరకూ పోలైన పోస్టల్ బ్యాలట్‌లను.. ఆయా స్థానాల్లోని రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. తెలంగాణ వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్‌రూంల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు.. కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను పర్యవేక్షిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తుందో.. ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారో తెలియాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సి రావడంతో నేతలంతా ఈ కొద్ది రోజులు టెన్షన్‌ను బ్రేక్ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ ఎన్నికలలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం నేతలంతా ఫ్యామిలీతో, జాలీగా ట్రిప్‌లు ప్లాన్ చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలియాలన్నా కూడా జూన్ 1 వరకు ఆగాలి. ప్రచార హడావుడి, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో, హోరెత్తించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లుగానే.. హీటెక్కిన తమ మైండ్‌లను చల్ల బరుచుకునేందుకు ఫలితాలు వచ్చేలోపు కాస్త సేదతీరడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొంతమంది విదేశాలకు వెళ్లడానికి జర్నీకి రెడీ అవుతుంటే.. మరికొంతమంది ఇండియాలోనే వివిధ పర్యాటక ప్రాంతాలకు కనీసం 2,3 వారాల పాటు గడపాలని ప్లానులు వేసుకుంటున్నారు. దీంతో నిన్నటి వరకూ పడిన టెన్షన్‌కు..నేతలంతా భలే చెక్ పెట్టాలనుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY