ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు మరో 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ముగిసింది. అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కడప జిల్లా రాయచోటి నుండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాంప్రసాదరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయచోటి వైఎస్సార్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసిన మండిపల్లి రెండు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
తాజాగా చంద్రబాబు కేబినెట్‌లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానం దక్కించుకోవడం విశేషమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ రాయచోటు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
ఆ తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి 2012లో వైసీపీకి మారి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.అలాగే 2014లో గెలిచినా అప్పుడు వైసీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో గెలిచినా సరే జగన్ తన కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. ఇలా 4 సార్లు గెలిచినా ఆయనను మంత్రి పదవి వరించలేదు. కానీ ఇప్పుడు అదే రాయచోటి నుంచి తొలిసారి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రం.. చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కల్పించడం విశేషంగానే చెప్పుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE