వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష, పలు కీలక ఆదేశాలు

AP CM YS Jagan Mohan Reddy Held Review on Agricultural Related Sectors at Camp office Today, CM YS Jagan Reviews Agriculture, YS Jagan Reviews Civil Supplies Depts, YS Jagan Reviews On Agriculture Dept, Mango News, Mango News Telugu, CM Jagan Focuses On Farmers Support, NABARD, National Bank for Agriculture and Rural Development , Agriculture AP, Andhra Pradesh Priority To Agriculture, AP CM YS Jagan Mohan Reddy Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధరంగాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అగ్రి ఇన్ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బూడి ముత్యాలనాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశుసంవర్ధక, పాడిపరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి పలు కీలక సూచనలు చేశారు.

సీఎం జగన్ చేసిన కీలక సూచనలలో కొన్ని ముఖ్యమైన అంశాలు..

  • రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలి.
  • అలాగే సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలి.
  • అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలి.

యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాలపై అధికారులు అందించిన వివరాలు, సీఎం సూచనలు..

  • 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి.
  • 1615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ.
  • రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు అందించిన ప్రభుత్వం. ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం.
  • సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ.
  • 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి.
  • షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం.
  • ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలని సీఎం జగన్ ఆదేశాలు.
  • దీనికోసం రూ.1325 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లు.
  • ఆర్బీకేల పరిధిలో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అధికారులకు సీఎం ఆదేశం.
  • అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశం.

అమూల్‌ పాలసేకరణపై సీఎం జగన్ సమీక్ష..

  • అమూల్‌ 2,34,548 మహిళా రైతుల నుంచి ఇప్పటివరకూ 419.51 లక్షల లీటర్ల పాలసేకరణ.
  • పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి.
  • అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి.
  • ఆయా డైరీలు ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి.
  • వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరించనున్న అమూల్‌ పాలసేకరణ, అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ.
  • చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశం.

ధాన్యం సేకరణ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు..

  • మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు.
  • సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసి విధి విధానాలు రూపొందించిన పౌరసరఫరాల సంస్థ.
  • ధాన్యం సేకరణలో భాగస్వాములు కానున్న వాలంటీర్లు, వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =