ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల తనను కలిసిన వారందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యేను కలిసిన నేతలు, కార్యకర్తలకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5,27,512 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu