భారత వైమానిక దళంలోకి చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు

5 Rafale Fighter Jets, 5 Rafale Fighter Jets Inducted into Indian Air Force, Indian Air Force, indian air force fighter planes, indian air force fighter planes list, Rafale fighter jet induction, Rafale Fighter Jet Induction in IAF Latest News, Rafale fighter jets inducted into Air Force, Rafale jets India live updates, Rafale Jets Induction Live

భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 5 రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై 29 న ఫ్రాన్స్ నుండి భారత్ లోని హర్యానాలో గల అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు 5 రఫేల్‌ యుద్ధ విమానాలను దేశ వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. అంబాలా ఎయిర్ బేస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్‌ రక్షణ శాఖ మంత్రి ఫ్లొరెన్స్‌ పార్లె, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా పాల్గొని రఫేల్ విమానాలను అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ప్రార్ధనలు కూడా నిర్వహించారు.

ముందుగా మొత్తం 36 రఫేల్‌ యుద్ధ విమానాలు అప్పగింతకు గానూ రూ.59,000 కోట్లతో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటికే 5 రఫేల్‌ విమానాలు భారత్ కు చేరుకోగా, విడతల వారీగా మిగతావి కూడా తర్వలోనే భారత్ కు చేరుకోనున్నాయి. ప్రతిష్టాత్మకమైన రఫేల్‌ రాకతో భారత్ వైమానిక దళం మరింత బలపడనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here