ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత కృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గల ఆయన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున వారి నివాసానికి చేరుకొని నివలర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రముఖ తెలుగు నటులు వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు కృష్ణ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న కృష్ణ కుమారుడు, టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరితో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు నటులు, నిర్మాతలు ఉన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తదితరులు కూడా సూపర్‌స్టార్ కు నివాళులు అర్పించారు. కాగా ఈరోజు సాయంత్రం అభిమానులు, ప్రజలు సందర్శనార్ధం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలిలోని స్టేడియంలో కొద్దిసేపు ఉంచనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరుపనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY