జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాని మోదీ సలహా, కాల్పుల విరమణ, దౌత్యం కోసం పిలుపు

PM Modi Advice For Ukraine Crisis in G20 Summit Calls For Ceasefire and Diplomacy,G20 Summit, PM Modi Advises On Ukraine Crisis, PM Modi Calls For Ceasefire, PM Modi Calls For Diplomacy,Mango News,Mango News Telugu,PM Narendra Modi Latest News And Updates,PM Narendra Modi, India’s G20 Presidency,G20 Presidency Launch, PM Modi Launch G20 Presidency, G20 Presidency News And Updates, Indian Prime Minister Latest News,G20 Presidency Website Launch

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ మరియు దౌత్య మార్గానికి తిరిగి రావడానికి ప్రపంచం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మంగళవారం బాలి వేదికగా జరిగిన జీ20 సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క భయానక పరిస్థితులను ఉద్ఘాటించారు. గత శతాబ్దంలో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని విధ్వంసం చేసిందని గుర్తు చేసిన ఆయన ఆ తర్వాత శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఇక ఇప్పుడు మన వంతు వచ్చిందని అన్నారు. ప్ర‌పంచంలో శాంతి, సామరస్యం మరియు భ‌ద్ర‌త‌ల‌ను నిర్ధార‌ణ చేయ‌డానికి దృఢమైన మరియు సామూహిక దృఢ సంకల్పాన్ని చూపడం ఈ కాలపు ఆవశ్యకమని ప్రధాని అన్నారు. ప్రపంచానికి బలమైన శాంతి సందేశాన్ని అందజేయడానికి ప్రపంచ దేశాలన్నీ సహకరిస్తాయని విశ్వసిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాలు, నిత్యావసర వస్తువుల సంక్షోభం నెలకొందని, ప్రతి దేశంలోని పేద పౌరులకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి ఎరువుల కొరత రేపటి ఆహార సంక్షోభానికి కారణమవుతుందని, దీనిపై ప్రపంచ దేశాలన్నీ ఎరువు మరియు ఆహార ధాన్యాల సరఫరాను స్థిరంగా మరియు భరోసాతో నిర్వహించడానికి పరస్పర ఒప్పందాన్ని ఏర్పరచుకోవాలని మోదీ కోరారు. కాగా ప్రపంచ జీడీపీలో 85 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ప్రాతినిధ్యం వహించే శక్తివంతమైన కూటమి అయిన జీ20 అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టనుంది. అలాగే వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ ఆహార సంక్షోభం, వాతావరణ మార్పులు మరియు ఉక్రెయిన్ వివాదం ప్రధాన అజెండాగా ఉన్న శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాన మంత్రి ఈరోజు ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీపై జి20 వర్కింగ్ సెషన్‌లో పాల్గొననున్నారు.

ఈ సదస్సులో పాల్గొనడం కోసం సోమవారం ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. బాలి చేరుకున్న ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. అక్కడ స్థిరపడిన భారతీయులు భారీగా విమానాశ్రయానికి చేరుకొని ప్రధానికి స్వాగతం చెప్పారు. కాగా బాలీలో ఘనస్వాగతం పలికినందుకు భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో వేదిక వద్ద స్వాగతం పలికారు. ఈ క్రమంలో సదస్సు ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పరస్పరం ఒకరికొకరు చేతులు కలిపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వారిరువురూ షేక్ హ్యాండ్ ఇచినప్పటి ఫోటోను షేర్ చేసింది. అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ కూడా అభివాదం చేసి కరచాలనం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eight =