ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం మంచి పరిణామమని, అందరూ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతి రాష్ట్రంలో అంతర్భాగం, ఆ ప్రాంతాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దుతాం. రాజధాని రైతులకు కూడా ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని అన్నారు. ఈ బిల్లుల విషయంలో టీడీపీ ఎన్ని చేసినా చివరకు ధర్మమే గెలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu