మంగళగిరిలో అటవీశాఖ ప్రధాన కార్యాలయం ‘అరణ్య భవన్‌’ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Minister Peddireddy Ramachandra Reddy Inaugurates AP Forest Head Office Aranya Bhavan in Mangalagiri Today,Minister Peddireddy Ramachandra Reddy,AP Forest Head Office,Aranya Bhavan in Mangalagiri,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు అయింది. గుంటూరు అరణ్యభవన్‌లో ఉన్న అటవీశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ఆటోనగర్‌లోని విశాలమైన పీవీఎస్‌ ల్యాండ్‌మార్క్‌ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం తాడేపల్లికి అందుబాటులో ఉండేలా సమీపంలోని మంగళగిరిలో దీనిని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పనిచేయాలనుకుంటున్నామని, అటవిశాఖకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిపారు. ఇక ప్రజాస్వామ్యంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తాను సుమారు 5 దశాబ్దాల నుంచి రాజకీయంల్లో ఉన్నానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here