ప్రపంచ రికార్డు సాధించేలా కంటి వెలుగు కార్యక్రమం – తెలంగాణ సీఎస్ శాంతి కుమారి

Telangana Chief Secretary Santi Kumari Visits AV College and Inspected the Kanti Velugu Centre,Telangana Chief Secretary Santi Kumari,Telangana Chief Secretary,Santi Kumari,Santi Kumari Visits AV College,Inspected the Kanti Velugu Centre,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

ఈ రోజు నుండి (జనవరి 19, గురువారం) దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్ లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణను సీఎస్ శాంతి కుమారి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి తదితర ఉన్నతాధికారులతో కలసి కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, 2018 లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1 .57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందని వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న (జనవరి 18, బుధవారం) లాంఛనంగా ప్రారంభించిన ప్రస్తుత కంటి వెలుగు కార్యక్రమంలో తొలివిడత రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డు సాధించగలమని సీఎస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత కంటి వెలుగును సమర్దవంతంగా నిర్వహించడానికి 15000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితో కూడిన 1500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను అందచేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిర్దారిత ప్రాంతాల్లో నేడు కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here