
ఆయనకు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమాలోని డైలాగ్ ఇది. రాజకీయ చిత్రంలో పవన్ అందుకు రివర్స్. ఎక్కడ తగ్గాలో కాదు.. నెగ్గేందుకు ఎందాకా వెళ్లాలో కూడా ఆయనకు తెలుసు. మంచికి మంచే కాదు.. మాటకు మాట బదులివ్వగలనని చాలా సందర్భాల్లో నిరూపించాడు. జనం జోలికి, జన సైనికుల జోలికి వస్తే తాట తీస్తానంటూ చాలా సందర్భాల్లో ప్రత్యర్థులను హెచ్చరించారు. ప్రత్యర్థులపైకి ప్రసంగాల్లో పదునైన బాణాలను సంధించారు. ఎవరితోనైనా వినమ్రత, వినయంతో ఉండే పవన్.. సందర్భాన్ని బట్టి ఉగ్రరూపంతో తన శైలిని ఈ ఎన్నికల్లో ప్రదర్శించారు. రాజకీయాల్లో ఒక నవ శకానికి దారి చూపారు.
నిన్న పిఠాపురంలో పవన్ చెప్పినట్లు.. ఎలాంటి పదవులు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా పదేళ్ళ పాటు పార్టీని నడిపిన ఏకైక వ్యక్తి ఆయనే. రాష్ట్రంలో ఈసారైనా ప్రజా సంక్షేమ పాలన సాగించటం కోసం తమ పార్టీ సీట్లు వదులుకున్నారు. నిజంగానే ఆయన దేశంలోనే బలమైన రాజకీయ నాయకుడు.. ఎలాంటి పదవులు లేకున్నా పదేళ్ళ నుండి ఏపీలో పోరాటం చేస్తున్న నాయకుడు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో జరిగిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ, తాను గత పదేళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని వెల్లడించారు. ధర్మో రక్షతి రక్షితః అని వ్యాఖ్యానించారు. తనను తిట్టారని, తన భార్యాబిడ్డలను కూడా తిట్టారని, అవమానించారని, కానీ ప్రజల కోసం అన్నింటినీ భరించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “వచ్చే ముందు నా భార్యకు ఒకటే మాట చెప్పాను… ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలనేది విదుర నీతి. ఈ రాష్ట్రం కోసం మన కుటుంబాన్ని నష్టపోయినా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందాం అని నా భార్యకు చెప్పాను” అని తెలపడం ద్వారా కుటుంబసభ్యులను కూడా త్యాగాలకు సంసిద్ధం చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల పై విరుచుకుపడ్డారు. మాటల్లాంటి తూటాలు పేల్చారు.‘‘ నా సహనాన్ని పిరికితనం అనుకోవద్దు.. ఎవరి బెదిరింపులకు భయపడే వాడిని కాను. ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటాను.’’
‘‘జగన్ నా నాలుగో పెళ్లాం..’’ తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సంయుక్తంగా చేపట్టిన మీటింగ్‌లో మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ‘‘సిద్ధం సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దాం. యుద్దం, రక్తం, కన్నీళ్లు , గాయాలు , బాధలు, వేదనలు తప్ప. కలలు, కలలు, పిరికితనం మోసం తప్ప. ఐదేళ్ల పాలనలో యువతను మోసం చేశారు.’’
‘‘నేను తాతల, తండ్రుల వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన వాడిని కాదు. మొదటితరం రాజకీయ నాయకుడిని. మధ్యతరగతి వాడిని. మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలుసు. రాష్ట్ర ప్రజల కోసం ఇంత దూరం వచ్చాను.’’
“జగన్ ఇవాళ భయపడుతున్నాడు. జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన పార్టీ. జగన్ ఇవాళ రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నాడు, మాట్లాడడానికే భయపడుతున్నాడు. ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడని భయపడుతున్నాడు. జగన్ మన హక్కులను అణచివేయాలని చూశాడు, భయపెట్టాలని చూశాడు. అలాంటి వ్యక్తిని భయపెట్టింది జనసేన పార్టీ!
ఒక వీరమహిళ, ఒక జనసైనికుడు, సుగాలి ప్రీతి తల్లి, భవన నిర్మాణ కార్మికులు నా వద్దకు సమస్యలు తీసుకుని వస్తే వారి తరఫున నేను ప్రశ్నించి భయపెట్టాను. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీని పక్కనబెట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ కండువాను మెడలో వేసుకున్నారంటే… అదీ… జనసేన పార్టీ బలం! అంటూ పార్టీ ఔన్నత్యాన్ని చాటారు.
ఏపీ దశ దిశ మార్చేందుకు పిఠాపురం వచ్చాను. పిఠాపురం నుంచే మొదలుపెడతా. దేశం గర్వించేలా పిఠాపురం నుంచే మార్పుకు శ్రీకారం చుడతా. నేను పనిచేస్తోంది ప్రజల కోసం, యువత కోసం. ఒక తరం కోసం పోరాడుతున్నాను, రెండు తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను… అంటూ తన ఆశ, శ్వాస ప్రజలే అని తెలిపారు. కొత్త తరం రాజకీయాలకు బాటలు వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY