రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ అభినందనలు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Congratulate Everyone who Made the Rajahmundry Program Grand Success

అక్టోబర్ 2న రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “పాలకపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజమండ్రిలో హుకుంపేట సభ, శ్రమదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. హౌస్ అరెస్టులు, అడుగడుగునా ఆంక్షలు, పోలీసుల అష్టదిగ్భందనాన్ని దాటుకొని సభ ప్రాంగణానికి చేరుకున్న నాయకులు, జనసైనికులు, వీర మహిళల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నేతలను, శ్రేణులను హౌస్ అరెస్టులు చేశారు. వాటిని దాటుకొని జిల్లా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు” అని చెప్పారు.

“ఎన్నో అడ్డంకులు, ఇంకెన్నో ఒత్తిళ్లు ఎదురైనా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులు శెట్టిబత్తుల రాజబాబు, మేడా గురుదత్ ప్రసాద్, వేగుళ్ల లీలాకృష్ణ, తుమ్మల బాబు, బండారు శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, మరెడ్డి శ్రీనివాస్, మాకినీడు శేషు కుమారి, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర, వరుపుల తమ్మయ్య బాబు, పార్టీ నేతలు డి.ఎమ్.ఆర్. శేఖర్, వై.శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త కళ్యాణం శివ శ్రీనివాస్ నేతృత్వంలోని కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ