తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

2020 SSC Time Table, AP Latest News, AP Political Updates 2019, AP SSC 2020 Exams Time Table, Mango News Telugu, Political Updates 2019, SSC 2020 Exams Time Table, telangana, Telangana And AP States, Telangana Breaking News, Telangana Political Updates 2019, Telangana SSC 2020 Exams Time Table

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 3, మంగళవారం నాడు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్ణయించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1తో పరీక్షలు ముగుస్తాయి. అయితే స్పెషల్ లాంగ్వేజ్ మరియు ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 6తో పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ మరియు ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 8వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి.

తెలంగాణ పదివ తరగతి పరీక్షల షెడ్యూల్:

మార్చ్ 19: ప్రథమ భాష పేపర్ – 1 (గ్రూప్ ఏ), ప్రథమ భాష పేపర్ -1 (కాంపోజిట్ కోర్సు)
మార్చ్ 20: ప్రథమ భాష పేపర్ – 2 (గ్రూప్ ఏ), ప్రథమ భాష పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు)
మార్చ్ 21: సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 23: ఇంగ్లీష్ పేపర్ -1
మార్చ్ 24: ఇంగ్లీష్ పేపర్ -2
మార్చ్ 26: మ్యాథమేటిక్స్ పేపర్ -1
మార్చ్ 27: మ్యాథమేటిక్స్ పేపర్ -2
మార్చ్ 28: జనరల్ సైన్స్ పేపర్ -1
మార్చ్ 30: జనరల్ సైన్స్ పేపర్ -2
మార్చ్ 31: సోషల్ స్టడీస్ పేపర్ -1
ఏప్రిల్ 1: సోషల్ స్టడీస్ పేపర్ -2
ఏప్రిల్ 3: ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం&అరబిక్)
ఏప్రిల్ 4: ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం&అరబిక్)
ఏప్రిల్ 6: ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ)

ఆంధ్రప్రదేశ్ పదివ తరగతి పరీక్షల షెడ్యూల్:

మార్చ్ 23: ప్రథమ భాష పేపర్ – 1 (గ్రూప్ ఏ), ప్రథమ భాష పేపర్ -1 (కాంపోజిట్ కోర్సు)
మార్చ్ 24: ప్రథమ భాష పేపర్ – 2 (గ్రూప్ ఏ), ప్రథమ భాష పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం&అరబిక్)
మార్చ్ 26: సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 27: ఇంగ్లీష్ పేపర్ -1
మార్చ్ 28: ఇంగ్లీష్ పేపర్ -2
మార్చ్ 30: మ్యాథమేటిక్స్ పేపర్ -1
మార్చ్ 31: మ్యాథమేటిక్స్ పేపర్ -2
ఏప్రిల్ 1: జనరల్ సైన్స్ పేపర్ -1
ఏప్రిల్ 3: జనరల్ సైన్స్ పేపర్ -2
ఏప్రిల్ 4: సోషల్ స్టడీస్ పేపర్ -1
ఏప్రిల్ 6: సోషల్ స్టడీస్ పేపర్ -2
ఏప్రిల్ 7: ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం&అరబిక్)
ఏప్రిల్ 8: ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ)

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 16 =