దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయాలు, ఆల‌యాల మీద దాడులపై సీఎం వైఎస్ జ‌గ‌న్

AP Attacks on Temples, AP CM YS Jagan, AP CM YS Jagan Responds over Attacks, Attacks on Hindu temples, Attacks on Temples, Attacks on Temples In AP, Attacks on Temples in the State, desecration of temples in Andhra, Jagan Responds over Attacks on Temples, Mango News Telugu, Series of attacks on temples in Andhra

ఏపీ పోలీసు తొలి డ్యూటీ మీట్‌ను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో సోమవారం నాడు సీఎం వైఎస్ ‌జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఇటీవల ఆల‌యాల మీద జరుగుతున్న దాడులపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునే కలియుగం క్లైమాక్స్ లో మనం ఉన్నామ‌ని, మారుమూల గ్రామాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి పథకం ప్రకారం ప్రజల్ని రెచ్చకొడుతున్నార‌ని అన్నారు. ప్రభుత్వానికొస్తున్న మంచిపేరును తట్టుకోలేక ప్రజల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే ఆలయాలపై దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు. విగ్రహాలు పగలకొడితే ఎవరికి లాభం? ప్రార్థనా మందిరాల్లో హింసకు పాల్పడేది ఎవరు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? లాంటి విషయాలు ప్రజలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞ‌ప్తి చేశారు.

మరోవైపు రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం‌ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఆధునీకరణకు సంబంధించి ప్రాథమికంగా ఆలయ డిజైన్లు తయారు చేయించామని, త్వరలోనే విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను కూడా ఖరారు చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 4 =