ఏపీ అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా అన్ని పార్టీల అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. దీనికితోడు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా మొన్నటితో ముగియడంతో ఎన్నికల సంఘం.. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల ఫైనల్ జాబితాలను ఖరారు చేసింది.
అయితే అందరి చూపూ పడిన కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల తుది జాబితాను కూడా ఈసీ ప్రకటించింది. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉండటంతో..పవన్ కళ్యాణ్ పేరు ఈవీఎం బ్యాలెట్ ఆర్టర్‌లో ఎక్కడ ఉందో ప్రజలకు తెలియజేసేలా జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
జనసేన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి: కొణిదెల పవన్ కళ్యాణ్…ఈవీఎం బ్యాలెట్ నెంబర్: 04 అంటూ జనసేన ఎక్స్ ఖాతా ద్వారా వివరించింది. ఈవీఎం బ్యాలెట్ ఆర్డర్ లో పవన్ కళ్యాణ్ పేరు నాలుగో స్థానం లో ఉందని… పక్కనే గాజు గ్లాసు గుర్తు ఉందని చెబుతూ ఓటర్లకు అవగాహన కల్పించింది. ఈవీఎంలో ఉన్న 4వ నెంబరు ప్రెస్ చేసి.. పిఠాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్‌ను అఖండ మెజారిటీతో గెలిపిద్దామని జనసేన పార్టీ ఆ ప్రకటనలో తెలియజేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY