ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్

CM Jagan Gives Green Signal To Train AP Govt Teachers in Teaching with IIT Madras Experts,CM Jagan Signal To Train AP Govt Teachers,AP Govt Teachers in Teaching,IIT Madras Experts,Mango News,Mango News Telugu,AP Cm YS Jagan Mohan Reddy,YS Jagan Mohan Reddy Latest News and Updates,Jagananna Vidya Deevena Funds,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు..

 • పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్‌ తగ్గించాలి. అలాగే పాఠశాలలకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలి.
 • సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది. దీనిని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.
 • పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుంది. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు.
 • ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో విద్యార్థులకు ప్రతి దశలో అండగా ఉంటున్నాం.
 • వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుక కింద విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలి.
 • సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌.
 • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులను నిర్వహణ.
  1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలి.
 • పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలి.
 • జూన్‌ నాటికి తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.
 • 3 నుంచి 5 గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌ అందించాలి.
 • అలాగే 6 నుంచి 10 గ్రేడ్ల వారికి మూడు దశల్లో జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలి.
 • ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్షలు ఉంటాయి.
 • జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పరీక్షలు నిర్వహిస్తారు.
 • ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్‌ రూపొందించాలి.
 • ఇక ఇప్పటికే విద్యార్థులకు అందించిన ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.
 • దీనిపై తక్షణమే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలి.
 • ఇక ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తిస్థాయిలో చేయాలి.
 • ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్‌ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా త్వరలో చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =