ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

Janasena Social Media Twitter Accounts, Mango News Telugu, Pawan Kalyan About Janasena Social Media Twitter Accounts, Pawan Kalyan About Suspension Of Janasena Social Media Twitter Accounts, Pawan Kalyan Janasena Latest News, Pawan Kalyan Janasena Latest Political News, Pawan Kalyan Questions About Suspension Of Janasena Social Media Twitter Accounts, Suspension Of Janasena Social Media Twitter Accounts

జనసేన పార్టీకి, అభిమానులకు, కార్యకర్తలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జన సైనికుల ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై బుధవారం నాడు ఆయన ట్వీట్ చేశారు. జనసేన మద్దతుదారులకు చెందిన 400 ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేసారో అర్ధం కావడం లేదని అన్నారు. సామాన్య ప్రజలకోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేసారా? ఈ పరిణామాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని అడిగారు. తొలిగించిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ #BringBackJSPSocialMedia అనే ట్యాగ్ ను పవన్ కళ్యాణ్ జత చేసారు. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో యాక్టీవ్ గా ఉన్న జన సైనికులకు చెందిన 400 ట్విట్టర్ ఖాతాలను రెండు రోజుల క్రితం తొలగించడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యకలాపాలను స్వచ్చందంగా ప్రచారం చేస్తూ, పలు సామాజిక రాజకీయ అంశాలపై స్పందిస్తున్న ఖాతాలు సస్పెండ్ అవ్వడంతో కారణాలు తెలియక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

[subscribe]