దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం

Amit Shah Comments On Hindi Language Imposition, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Rajinikanth Opposes Amit Shah, Rajinikanth Opposes Amit Shah Comments, Rajinikanth Opposes Amit Shah Comments On Hindi Language, Rajinikanth Opposes Amit Shah Comments On Hindi Language Imposition

ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్పందించారు. భారతదేశాన్ని ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్న అమిత్ షా వ్యాఖ్యలతో రజనీకాంత్‌ విభేదించారు. హిందీని జాతీయ భాష గా చేసే ఆలోచన ఎవరూ ఆమోదించబోరని స్పష్టం చేసారు. హిందీ భాషను అమలు చేయడం ఎక్కడైనా సాధ్యపడుతుందేమో కానీ దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు.

బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రజనీకాంత్‌, దక్షిణ భారతదేశములో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదని అన్నారు. దేశవ్యాపంగా ఒకే భాష అమలుచేస్తే దేశాభివృద్ధికి మంచిదే కావచ్చు కానీ మనదేశంలో ఒకే భాష లేదని ఆయన చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడ ఒకే భాష విధానాన్ని ఆమోదించరని తాను భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలనుంచి డీఎంకే అధినేత స్టాలిన్, నటుడు కమల్ హాసన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాంటి నాయకులు అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించి, తీవ్ర వ్యతిరేకతను తెలియజేసారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 3 =