
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టాక కొత్త సర్కార్‌పై ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా అమలు చేస్తున్న విధానాలకు ఏపీ ప్రజలు ఫిదా అయిపోతున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో లోకల్.. నాన్ లోకల్ నినాదం హీటెక్కిన విషయం తెలిసిందే.
నాన్‌లోకల్ అయిన పవన్ కళ్యాణ్‌కు ఏపీ వాసులు ముఖ్యంగా పిఠాపురం ప్రజల కష్టాలు, బాధల గురించి పట్టించుకోరంటూ వైసీపీ నేతలు ప్రధాన విమర్శనాస్త్రంగా వాడేవారు. పవన్ ను గెలిపిస్తే ఎన్నికల తర్వాత ఆయన పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోవడం ఖాయం అంటూ పదేపదే విమర్శలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహించేవారు. అయితే పవన్ కళ్యా ణ్ వారికి అప్పట్లో గట్టిగానే సమాధానమిచ్చారు. తాను శాసనసభ్యుడిగా గెలిచిన వెంటనే పిఠాపురంలోనే ఇళ్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటానంటూ ప్రచారాలలో చెబుతూ వచ్చారు. అలా చెప్పిన పవన్ మాటలనే నమ్మిన ప్రజలు..ఎన్నికల్లో పవన్‌తో పాటు ఆయన పార్టీ అభ్యర్థులకు 100% స్ట్రైక్ రేట్‌తో బంపర్ మెజార్టీతో గెలుపొందేలా చేశారు.
అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిఠాపురంలోనే ఉంటానని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగానూ ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు తన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి 3.52 ఎకరాల స్థలాన్ని కొనుక్కున్నారు. కాకినాడ జనసేన నేత తోట సుధీర్.. పవన్ తరపున గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఈ భూమిని పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా పవన్ మాటను నిలబెట్టుకోవడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా 9 నెలలుగా మిస్ అయిన ఏపీ యువతి ఆచూకీని వెంటనే కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేరేలా చేసిన పవన్ కళ్యాణ్ చొరవకు ఏపీ వాసులు ఫిదా అయిపోతున్నారు. మరోవైపు పాలనా పరంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE