జనసేన కండువా కప్పుకున్న జానీ మాస్టర్, పృథ్వీరాజ్

Jana Senas Scarf Clad Johnny Master Prithviraj, Jana Senas Scarf, Johnny Master, Prithviraj, Johnny Master Jana Senas Scarf Clad, AP Elections, Janasena, Pawan kalyan, Latest Johnny Master News, Johnny Master Janasena News, Johnny Master Jion Janasena, Latest Janasena News, AP CM Jagan, Andra Pradesh, Mango News, Mango News Telugu
AP Elections, Janasena, Pawan kalyan, Pruthviraj

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మిగిలిన స్థానాలకు కూడా ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అటు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న జనసేన-తెలుగు దేశం పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. ఈ సమయంలో పెద్ద ఎత్తున నేతలు కండువాలు మార్చేయడం ఏపీలో కాక రేపుతోంది.

ఈసారి జనసేనను ఎదుర్కొనేందుకు వైసీపీ పలువురు సినీ ప్రముఖులను రంగంలోకి దింపుతోంది. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్, హాస్యనటుడు ఆలీలతో పాటు రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీలను లోక్‌సభ బరిలోకి దింపేందుకు వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వారు పోటీ చేయబోయే స్థానాలు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేనలోకి కూడా చేరికలు పెరిగిపోయాయి. వైసీపీలోని అసంతృప్తులతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు జనసేన కండువా కప్పుకున్నారు.

పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలవేళ జనసేన పార్టీలో చేరిపోయారు. బుధవారం జానీ మాస్టర్ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్‌తో సమావేశారు. అనంతరం జానీమాస్టర్‌కు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే టికెట్ హామీతోనే జానీ మాస్టర్ జనసేనలో చేరిపోయింది. ఈక్రమంలో ఆయన  ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే జానీ మాస్టర్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడంతో.. అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు హాస్యనటుడు పృధ్వీరాజ్ కూడా జనసేన పార్టీలో చేరిపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో పృథ్వీరాజ్ వైఎస్సార్‌సీపీలో పని చేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌వీబీసీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట పృథ్వీరాజ్ వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =