
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటితో ప్రచార పర్వం కూడా ముగిసిపోతుంది. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ కదిలివస్తోందా అన్నట్లుగా పిఠాపురం అంతా మెగా హీరోలు, బుల్లితెర నటులు సందడి చేస్తున్నారు. దీనికితోడు మెగాస్టార్ తమ్ముడి కోసం రిలీజ్ చేసిన మెగా వీడియోతో మద్దతు బాగా పెరుగుతోంది.
మరోవైపు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని , తేజ సజ్జా, రాజ్ తరుణ్ , సంపూర్ణేష్ బాబు ఇలా చాలామంది ప్రత్యేకంగా ట్వీట్స్ చేస్తూ జనసైనికుల్లో జోష్‌ను నింపుతున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఏకంగా వైసీపీని ఓడించాలని..వైసీపీ శ్రేణులను ఉగ్రవాదులుగా చెబుతూ హాట్ కామెంట్లు చేశారు.
నిజానికి వైసీపీ సర్కారు మొదటి నుంచీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపే చూసింది. ముఖ్యంగా టిక్కెట్ల ధర పెంపు విషయంలో అడ్డగోలుగా వ్యవహరించడమే కాదు.. వైసీపీ మంత్రులయితే స్థాయికి మించి స్పందించారు. మెగాస్టార్ లాంటి సినీ పెద్దలను అవమానపరిచారు. దీంతో టాలీవుడ్ నుంచి ప్రశ్నించే గొంతుక బలమైనది ఉంటే బాగుంటుందన్న కోరిక చిత్రపరిశ్రమలో బాగా పెరిగింది.
2019లో జరిగిన ఎన్నికల్లో టాలీవుడ్‌లో కొంతమంది వైసీపీకి మద్దతు ప్రకటించగా..టీడీపీ సానుభూతిపరులైన మరికొంతమంది సైలెంట్ అయ్యారు. దానికి జగన్‌కు సన్నిహితుడు అయిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉండడమే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రేవంత్ అధికారంలో ఉండటంతో.. టాలీవుడ్‌కు చెందిన చాలామంది పవన్ కోసం గళమెత్తుతున్నారు.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మనసులో ఉన్న బాధను, అభిప్రాయాన్ని బయటపెట్టారు. వ్యక్తిగతంగా కూడా పవన్ అంటే అభిమానమున్న త్రివిక్రమ్ పవన్‌పై అభిమానంతో ఆమధ్య ఒక పాట రాశారు. అప్పటి నుంచి తనను వైసీపీ టార్గెట్ చేసుకుందని.. సోషల్ మీడియాలో తన పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5వేల కాల్స్ వచ్చినట్లు త్రివిక్రమ్ చెప్పారు. ఇలా చాలామందిని తమకు వ్యతిరేకంగా మార్చుకున్న వైసీపీ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలను రాబట్టుకుంటుందో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY