ఎవరూ ఊహించి ఉండరు.. ఆయనకు రాజకీయాల్లో అంత పరిణితి ఉంది.. అని.. ప్రత్యర్థులు అస్సలే ఊహించి ఉండరు.. తొలిఅడుగుల్లోనే ఆయన అంత ప్రజాదరణ పొందారని .. టికెట్ ఇచ్చినప్పటికీ.. పార్టీలోనూ ఆయనపై ఎంతో కొంత సంశయం ఉండే ఉంటుంది.. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ప్రత్యర్థి పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.. పదునైన మాటలతో సవాల్ విసురుతూ పార్టీలో ఉత్సాహం పెంచుతున్నారు.. ఆయన ధాటిని తట్టుకునేందుకు ప్రత్యర్థి పార్టీ ఏకంగా ఇన్‌చార్జినే మార్చాల్సి వచ్చింది.. అతితక్కువ కాలంలోనే రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీచేయబోతున్నారు. ఆ స్థానం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. అంతకు ముందు కూడా అక్కడ ఆయనే ఎంపీ. మూడోసారి కూడా పోటీచేస్తే హ్యాట్రిక్ సాధిస్తారని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే.. అనూహ్యంగా ఆయన రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన వెనుక ఉన్న కారణాల సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే.. గల్లా గుంటూరు ఎంపీ స్థానం నుంచి తప్పుకోవడంతో మరి అక్కడి నుంచి పోటీచేసేది ఎవరు అనే చర్చ మొదలైంది.
సాధారణంగా వ్యాపార, ఇతర రంగాల్లో స్థిరపడిన వారే రాజకీయాల్లోనూ నిలదొక్కుకుంటారు. గల్లా కూడా ఆకోవకు చెందిన వారే.. కానీ ఆయన పోటీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తన వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు సృష్టించడమే అని ప్రచారంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి సమస్యలను కొనితెచ్చుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అలాంటి సమయంలో నేనున్నా అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. ఆయన గురించి అన్ని రకాలుగానూ పరిశీలన జరిపి, సర్వేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించింది. ఉద్యోగ బాధ్యతల్లో ఎక్కువ కాలం అమెరికాలో స్థిరపడ్డ ఓ ఎన్నారైకు సీటు ఇచ్చారని తెలియగానే.. ప్రత్యర్థి పార్టీ తొలుత లైట్ తీసుకుంది. ఆయనకేం తెలుసు రాజకీయాలు అనుకుంది.
కానీ.. పెమ్మసాని రంగంలోకి దిగి, మైకు పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రత్యర్థి పార్టీ వైసీపీకి మైండ్ బ్లాక్ అయింది. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన తీరుపైనా, స్థానిక సమస్యలపైనా, రాజకీయ పరిస్థితులపైనా చంద్రశేఖర్ చేస్తున్న ప్రసంగాలు విని నోరెళ్లబెడుతోంది. పరిచయ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాల్లోనే పెమ్మసాని ఇలా మాట్లాడుతుంటే.. ఎన్నికల సమరం మొదలై.. పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగితే పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. గుంటూరుపై పెమ్మసానికి ఉన్న అవగాహనను గమనించి, సొంత పార్టీ కార్యకర్తలు కూడా తమ నాయకుడిపై అభిమానం పెరుగుతోంది.
పెమ్మసాని రంగ ప్రవేశంతో స్థానికంగా టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ వ్యూహం మార్చుకోవాల్సి వచ్చింది. నెల రోజుల్లోనే ఇన్‌చార్జిని మార్చేసింది. తొలుత ఉమ్మారెడ్డి వెంకటరమణ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఆయన పార్టీ నేతలు, శ్రేయోభిలాషులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించారు. ఇంతలోనే ఆయనను మార్చి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు బాధ్యతలు అప్పగించింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి నుంచి పెమ్మసానికి టికెట్ ఖరారుకాగానే, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో బుర్రిపాలెం బుల్లోడు అనగానే సూపర్‌స్ఠార్ కృష్ణ ను తలుస్తున్నట్లుగానే.. రాజకీయాల్లో బుర్రిపాలెం బుల్లోడు.. వైసీపీకి బల్లెం లాంటోడు అనగానే.. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెరపైకి వస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE