అది.. పెమ్మ‌సానికి జ‌య సంకేత‌మే!

Pemmasani Chandrasekhar, AP, TDP, AP Elections, TDP Guntur MP Candidate, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Updates, Andhra Pradesh, AP Political updates, Pemmasani Chandrasekhars Victory in Guntur, Mango News Telugu, Mango News
Pemmasani chandrasekhar, AP , TDP, AP Elections, TDP Guntur MP Candidate

ప్ర‌జ‌ల్లో మంచిత‌నం.. గుండెల్లో నిబ్బ‌రం.. క‌ష్ట‌ప‌డే త‌త్వం.. ఆ మూడూ ఉన్న నిండైన వ్య‌క్తి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. అందుకే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో వేస్తున్న తొలిఅడుగులోనే.. ఆయ‌న వెంట వేలాది మంది న‌డుస్తున్నారు. ఆయ‌న ఏఊరు వెళ్లినా సాద‌రంగా స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే కాదు.. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఇటీవ‌ల గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి పెమ్మ‌సాని హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ఆయ‌న తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌. ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్తలు స్వాగ‌తం ప‌ల‌క‌డం, జ‌య‌జ‌య‌ధ్వానాలు ప‌ల‌క‌డం సాధార‌ణ‌మే. కానీ.. అనూహ్యంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అధిక సంఖ్య‌లో యువ‌త అధిక సంఖ్య‌లో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు స్వాగ‌తం ప‌ల‌క‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో పోటీచేయ‌బోతున్న కూట‌మి అభ్యర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా, ఉత్సాహంగా ఆద‌రిస్తున్నారు. ఇది ఓ ర‌కంగా పెమ్మ‌సానికి జ‌య‌కేత‌నంగా చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా..  మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదురు మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వ‌హించిన‌ ‘జయహో బీసీ సభ’ స‌క్సెస్ కూడా ఓ విజ‌య సంకేత‌మే. ఆ స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన బీసీ డిక్లరేషన్‌.. పెమ్మ‌సాని విజ‌యానికి మ‌రింత స‌హ‌క‌రిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. స‌భ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన హామీలు, చేసిన ప్ర‌సంగాలు కూడా గుంటూరులో తెలుగుదేశాన్ని, పార్టీ అభ్య‌ర్థులు గెలుపున‌కు స‌హ‌క‌రించేలా ఉన్నాయి.

రాష్ట్రంలో బీసీ వర్గాల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించి ఆక‌ట్టుకున్నారు. వాస్త‌వానికి డాక్ట‌ర్ పెమ్మ‌సాని కూడా బీసీ స‌భ‌లో అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. వైసీపీ అంటే ఇద్ద‌రు నేత‌లే గుర్తుకు వ‌స్తార‌ని, టీడీపీలో బీసీ నేత‌ల‌కు వంద‌ల సంఖ్య‌లో గుర్తుకు వ‌స్తార‌ని తెలిపారు. మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ‘40 ఏళ్లుగా బీసీలు ఈ పార్టీని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. తమ ఇంటి పార్టీగా భావించారు. జ్యోతిరావు ఫూలే ఆదర్శాలను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అక్షరాలా ఆచరించి చూపించారు. మా ప్రతి అడుగులో బీసీ వర్గాల వారు ఉన్నారు. వారి కోసమే మేమున్నాం’ అని వివ‌రించారు.

జగన్‌ ఐదేళ్ల పాలనలో బీసీలు ఎంతో నష్టపోయారు. వారికి మళ్లీ ఊపిరి ఇవ్వడానికి టీడీపీ తెచ్చిన ప్రత్యేకంగా తెచ్చిన‌ బీసీ డిక్లరేషన్ పెమ్మ‌సాని గెలుపులో కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ‘బీసీ వర్గాలు లేకపోతే నాగరికత లేదు. మన సంస్కృతికి బీసీ కులాల వారు ఒక చిహ్నం. రజకులు లేకపోతే మనం రోజూ ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగలేం. మన జీవనంలోని అనేక కోణాల్లో బీసీ కులాల వారి కుల వృత్తుల పాత్ర ఉంది. ఈ అన్ని కులాలకు న్యాయం చేయాలి. చిన్నా పెద్దా అన్ని కులాలకు తగిన నిధులు ఇచ్చి వారిని ఆదుకుంటాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెస్తాం. టీడీపీ రాక ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. ఎన్టీఆర్‌ ఆ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఆ వర్గాల్లో రాజకీయ నాయకత్వం పెరిగింది. నేను ఆ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాను. జగన్‌ వచ్చి 24 శాతానికి కుదించాడు. బీసీలు ఆర్థికంగా పైకి రావడానికి మేం ఆదరణ పథకం పెట్టాం. జగన్‌ వచ్చి రద్దు చేశాడు’ అంటూ జ‌గ‌న్ పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

పెమ్మ‌సాని కూడా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ బీసీ వ్య‌తిరేక విధానాల‌ను  కొద్దిరోజులుగా ఎండ‌గ‌డుతూ ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు స‌భ‌తో వారి అభిమానం మ‌రింత‌గా పెమ్మ‌సానికి పెర‌గ‌నుంది. కుల‌, మ‌త‌, వ‌ర్గ బేధాలు లేకుండా డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ చేస్తున్న కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఆద‌ర‌ణ‌ను తెచ్చిపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తాజాగా ప్ర‌క‌టించిన బీసీ డిక్ల‌రేష‌న్ తో పెమ్మ‌సాని గెలుపుఖాయ‌మ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీంతోపాటు.. బీసీ వ‌ర్గాల‌తో పాటూ.. ప్ర‌తి వ‌ర్గానికీ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్న‌ పెమ్మ‌సాని మున్ముందు మ‌రింత ఆద‌ర‌ణ చుర‌గొన‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే పెమ్మ‌సాని గెలుపుపై విజ‌య సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE