తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల కోసం ఓటు వేయడానికి ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు, ఒక కంటోన్మెంట్ ఉపఎన్నికకు నేడు పోలింగ్ జరుగుతోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గానూ.. 525 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. సాధారణంగా 5 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ ముగియనుండగా.. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఒక గంట వ్యవధిని పెంచారు. దీంతో ఓటర్లు సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని పొందారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
మరోవైపు పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం తెలంగాణ వ్యాప్తంగా సెలవును ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వీరిలో 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు ఎన్నికల విధుల కోసం 2లక్షల 80వేల మంది సిబ్బంది పాల్గొనగా.. 160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అదనంగా 20వేల మంది పోలీస్ బలగాలు మొహరించాయి.
ఇక తెలంగాణ వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లు..ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 1కోటి 65లక్షల 28వేల మందది పురుషులు కాగా 1కోటి 67లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-20 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు 9లక్షల 20వేలు కాగా వికలాంగులు 5లక్షల 27వేలు మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35, 808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా… అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలున్నాయి. 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లతో పాటు.. 44,906 కంట్రోల్ యూనిట్లను అందుబాటులో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY