ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి

Prime Healthcare Foundation Chairman Dr Prem Sagar Reddy Meets CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమెరికాలోని ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి కలిశారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ప్రైమ్‌ హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాలలో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, అమెరికాలోని టాప్‌ టెన్‌ వైద్య వ్యవస్ధల్లో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అనంతరం డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి మాట్లాడుతూ, సీఎంతో జరిగిన సమావేశం మంచి సహృద్బావ వాతావరణంలో జరిగిందన్నారు. దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, అలాగే తన సహాధ్యాయి అని డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి తెలిపారు. ఈ భేటీ సందర్భంగా సీఎంతో వివిధ అంశాలపై చర్చించానని, అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్యరంగంపై చర్చ జరిగిందని చెప్పారు.

“రాష్ట్రంలో ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్‌ చాలా బావుంది. ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం, మరే రాష్ట్రంలోనూ కూడా వైద్య ఆరోగ్యశాఖలో ఇంత పెద్ద మొత్తంలో సిబ్బంది లేరనుకుంటున్నాను. ఏపీకి డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్లు, అత్యాధునిక మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ను ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను. కోవిడ్‌ సమయంలో కూడా ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లు ఇచ్చాను. పేదలకు ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ది చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్దికి గొప్ప కృషిచేస్తున్నారు. తన తండ్రిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది” అని డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్‌ ప్రసాద్‌ జి.రెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డాక్టర్‌ రాఘవరెడ్డి, మెడికల్‌ అడ్వైజర్‌ ఎన్నారై ఎఫైర్స్‌ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సుగుణాకర్‌, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE