తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే ఒప్పందం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అయితే అన్‌లాక్-4 లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు ప్రారంభించారు. పన్నులు చెల్లించి, రవాణా శాఖ వద్ద క్లియరెన్స్ తీసుకుని, కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు బస్సులు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ ను కూడా ఆపరేటర్లు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ మరియు విశాఖపట్నంలో సిటీ బస్సు సర్వీసులు మొదలుపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu