రేపటి నుంచి తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేత

Govt Stops All Types of Registrations, telangana, Telangana Breaking News, Telangana Govt, Telangana Govt Orders to Stop All Types of Registrations, Telangana Govt Stops All Types of Registrations, Telangana News, Telangana Political News, Telangana Stops All Types of Registrations

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి అన్నిరకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ ‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారందరికీ ఈ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. రేపటి నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మళ్ళీ ఎప్పటినుంచి ప్రారంభిస్తారనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టంపై కీలకంగా చర్చించి ఆమోదించే అవకాశమునట్టు తెలుస్తుంది. మరోవైపు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దుచేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తునట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =