అన్‌లాక్‌-4 : ఏపీలో సినిమా థియేటర్స్ పై నిషేధం కొనసాగింపు

Andhra Pradesh Unlock 4, Andhra Pradesh Unlock 4 Guidelines, Andhra Pradesh Unlock 4 News, Andhra Pradesh Unlock 4 Updates, AP Government has Issued Unlock-4 Guidelines, AP Government Unlock-4 Guidelines, Guidelines for Unlock 4.0, Lockdown guidelines in Andhra Pradesh, unlock 4 guidelines, Unlock 4.0 Andhra Pradesh, Unlock-4 Guidelines In AP

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు మూసివేస్తునట్టు పేర్కొన్నారు‌. సెప్టెంబర్ 21 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులతో పాటుగా, ఇంటర్‌, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. అయితే వారు విద్యాలయాలకు వెళ్లేందుకు తల్లిదండ్రుల నుంచి రాత పూర్వక అంగీకార పత్రం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో అమలు కానున్న అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు:

  • సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు బంద్.
  • సెప్టెంబర్ 20 నుండి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి. కోవిడ్ నిబంధనలు పాటించాలి.
  • అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.
  • సెప్టెంబర్ 21 నుండి సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన సహా బహిరంగ సమావేశాలు 100 మందితో అనుమతించబడతాయి.
  • సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరవడానికి కూడా అనుమతి ఇచ్చారు.
  • సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, సంబంధిత ప్రదేశాలు తెరవడంపై నిషేధం.
  • ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహణకు అనుమతి.
  • అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలు, జిల్లాల మధ్య ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 17 =