
ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటారన్న విషయం తెలిసిందే. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ.. కొద్దిరోజుల్లో అధినేతపై తిరుగుబావుటా ఎగురవేసి ఢిల్లీలో కూర్చున్నారు. ఏపీ రాజకీయాల్లో ఉప్పు, నిప్పు లాంటివారిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య అప్పట్లో ఒక రేంజ్‌లో ఫైట్ జరిగింది. తరువాత జరిగిన పరిణమాలతో రెబల్ ఎంపీగా మారిన ఆయన.. సందు దొరికితే చాలు జగన్‌పై విరుచుకుపడటంతో.. ఈ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. కానీ తొలి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్.. ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామ ఇద్దరు గుసగుసలాడుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా చెప్పాలంటే ఇది సరికొత్త చర్చకు దారితీసింది.
అయితే దీని వెనుక ఓ రీజనుందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానానికి గురయ్యారట. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల వాహనాలకు మాత్రమే అనుమతి ఉండటంతో రఘురామ కారును గేటు ముందే ఆపేశారు. దీంతో మంత్రుల కాన్వాయ్‌లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ రఘురామ అధికారులను నిలదీశారు.
అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ ఒకచోట కలిపే ప్రాంతమని.. తన వాహనాన్ని ఎందుకు అనుమతించరని మండిపడ్డారు. అక్కడితో ఆగని రఘురామ.. ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఆ లెటర్లో కోరారు. దీంతో కాస్త హర్ట్ అయిన ఆర్ఆర్ఆర్ తనలో పాత రఘురామను తీసుకువచ్చారన్న వాదన వినిపిస్తోంది.
దీనికితోడు వైసీపీలో రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ.. ఈ ఎన్నికలలో కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినా కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపి ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని రఘురామ బంపర్ మెజార్టీతో విజయాన్ని సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి వస్తుందని ఆశించిన రఘరామ..ఆ పదవి రాకపోవడంతో దీనిపై బహిరంగంగానే సీఎం చంద్ర బాబుపై విమర్శలకు దిగారు.
అయితే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ఏకంగా జగన్‌తో ఆప్యాయంగా ముచ్చటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉంటూ జగన్‌తో ముచ్చటించడంతో రకరకాల టాక్‌లు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా విజయం సాధించిన ఆర్ఆర్ఆర్.. గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారి..సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. దీంతో టీడీపీలో కూడా రఘురామ కృష్ణరాజు మళ్లీ శిఖండిగా మారారనే చర్చ సాగుతోంది. నచ్చిన పదవి దొరకపోయినా.. తనకు నచ్చినట్లు పార్టీలో జరగపోయినా పాత రఘురామ ఇలా బయటకు వస్తారంటూ ఫన్నీ కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY