
ఏపీలో కొన్నాళ్లుగా లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి రెడ్ బుక్ హాట్ టాపిక్‌గా మారింది. యువగళం పాదయాత్రలో భాగంగా.. వైఎస్సార్సీపీ నాయకుల చెప్పుడు మాటలు విని.. నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన వారి పేర్లను రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నానని లోకేష్ చాలాసార్లు చెబుతూ వచ్చారు.
అంతే కాదు తాము అధికారంలోకి రాగానే రెడ్ బుక్ లో నోట్ చేసిన వారందరిపై చర్యలు ఉంటాయని లోకేష్ హెచ్చరించారు. అయితే లోకేష్ మాటలను సీరియస్ గా తీసుకున్నవారికంటే.. ఆ కామెంట్లకు కౌంటర్లు ఇచ్చేవాళ్లు ఎక్కువ అయినా లోకేష్ పట్టించుకోలేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు, అధికారులు కూడా లోకేష్ మాటలను పట్టించుకోకుండా హేళన చేశారు. అయితే చివరకు అంటే ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో.. కొంతమంది ఉద్యోగులు, అధికారులు తమ పేర్లను లోకేశ్ రెడ్ బుక్‌లో నమోదు చేసుకుంటున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించే వరకూ పరిస్థితి వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు నేటికీ కోర్టులో పెండింగ్‌లోనే ఉంది.
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక విశాఖ, మంగళగిరి పట్టణాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రెడ్‌బుక్ హోర్డింగ్స్ ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్‌బుక్ ఓపెన్ చేయడానికి సిద్ధమంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్స్ కొత్తగా దర్శనమిస్తున్నాయి. అయితే, నిజంగానే లోకేష్ రెడ్‌బుక్‌లో రాసిన విధంగా వారందరిపై చర్యలు తీసుకుంటారా.. లేక గత ప్రభుత్వంలో కక్ష సాధింపులకు దిగినవారిని ఓ ఆట ఆడుకుంటున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY