ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: వరుసగా నాలుగో రోజు సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly Budget Session : TDP MLAs Suspended for Fourth Day in a Row,AP Assembly Budget Session,TDP MLAs Suspended,MLAs Suspended for Fourth Day in a Row,Mango News,Mango News Telugu,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP Assembly 2023 Latest News,AP Assembly Latest News,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly Budget Session,AP Assembly 2023 State Budget,AP Assembly Budget News,AP Assembly Latest Budget Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు వరుసగా నాలుగోరోజు కూడా సస్పెండ్ అయ్యారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. సమావేశాల్లో ఐదోరోజైన శనివారం ఉదయం శాసనసభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే గురు, శుక్ర వారాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, సభలో నిరసనకు దిగారు.పేపర్లు చింపి పడేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగడం లేదంటూ, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు.

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలయిన అచ్చెన్నాయుడు, గద్దె రామ్మెహన్, గొట్టిపాటి రమికుమార్‌, నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణ, డోలా బాల వీరాంజనేయ స్వామి, మంతెన రామరాజు, గణబాబు, సాంబశివరావు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీలను సభ నుంచి ఒకరోజు పాటుగా సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మరోవైపు గత మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here