విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం మండలం సుంకరిపేట జంక్షన్ వద్ద రెండు ఆర్టీసి బస్సులు, లారీ ఢికొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజిహెఛ్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ముందుగా ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొనగా, ఈ క్రమంలో వెనుకనుంచి వస్తున్న లారీ కూడా ఓ బస్సును బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
ముందుగా ఈ ప్రమాద సంఘటన స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సందర్శించి, క్షతగాత్రులను వాహనాల్లో నుండి బయటకు తీయించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరికీ వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ